ఉక్రెయిన్ లో తొలి దశ పోరు విజయవంతమైంది: రష్యా ప్రకటన

  • ఫిబ్రవరి 24 నుంచి రష్యా దాడులు
  • ఉక్రెయిన్ లో భీకర పోరు
  • రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ బలగాలు
  • రాజధాని కీవ్ లో మళ్లీ కర్ఫ్యూ
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై తాము చేపడుతున్న సైనిక చర్యలో తొలి దశ విజయవంతం అయిందని వెల్లడించింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నామని పేర్కొంది. ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టి సారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది.

కాగా, రష్యా దళాలు ఉక్రెయిన్ లోని స్లావుటిచ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ పట్టణంలో చెర్నోబిల్ అణుకేంద్రం ఉద్యోగులు నివసిస్తుంటారు. అటు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో తాజాగా కర్ఫ్యూ విధించారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని నగర మేయర్ విటాలీ క్లిచ్కో వెల్లడించారు. 

మేరియుపోల్ నగరంలో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. నగర వీధుల్లో రష్యా సేనలకు, ఉక్రెయిన్ బలగాలకు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోందని నగర మేయర్ తెలిపారు.


More Telugu News