ఉక్రెయిన్ శ‌ర‌ణార్ధులను గుండెల‌కు హ‌త్తుకుని ఓదార్చిన బైడెన్‌

  • పోలండ్ ప‌ర్య‌ట‌న‌లో అమెరికా అధ్య‌క్షుడు
  • వార్సాలో ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌కు ప‌రామ‌ర్శ‌
  • వైర‌ల్‌గా మారిన బైడెన్ ఫొటోలు
  అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ శ‌నివారం పోలండ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పేరుకు పోలండ్ ప‌ర్య‌ట‌నే అయినా.. బైడెన్ ప‌ర్య‌ట‌న సాంతం ఉక్రెయిన్ ప‌రిస్థితుల‌ను అంచనా వేసేందుకేన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైపోయిన సంగ‌తి తెలిసిందే. పోలండ్ చేరుకున్న బైడెన్ తొలుత ఆ దేశాధ్య‌క్షుడితో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత రష్యా బీక‌ర దాడుల‌తో భీతిల్లిపోయి ఇత‌ర దేశాల‌కు శ‌ర‌ణార్థులుగా త‌ర‌లిపోయిన వారి వ‌ద్ద‌కు వెళ్లారు.

ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌కు చెందిన ల‌క్షలాది మంది ప‌లు దేశాల‌కు శ‌ర‌ణార్ధులుగా త‌ర‌లిన సంగ‌తి తెలిసిందే. అలాంటి వారు పోలండ్‌లోనూ చాలా మందే ఉన్నారు. పోలండ్ రాజ‌ధాని వార్సాలోని ఉక్రెయిన్ శ‌రణార్థుల వద్ద‌కు వెళ్లిన బైడెన్ వారిని త‌న గుండెల‌కు హ‌త్తుకుని ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా త‌మ వారి కోసం ప్రార్థించండి అంటూ ఉక్రెయిన్ శ‌ర‌ణార్ధులు త‌న‌కు చేసిన విన్న‌పాల‌ను ఆయ‌న మౌనంగానే స్వీక‌రించారు. శ‌ర‌ణార్థుల‌ను త‌న గుండెల‌కు హత్తు‌కుని ఓదార్చుతున్న బైడెన్ ఫొటోలు వైర‌ల్‌గా మారిపోయాయి.


More Telugu News