హైద‌రాబాద్‌కు రానున్న మరో ఐటీ కంపెనీ 'స్ప్రింక్ల‌ర్'

  • అమెరికా ప‌ర్య‌ట‌న‌లో దూసుకుపోతున్న కేటీఆర్‌
  • న్యూయార్క్‌లో స్ప్రింక్ల‌ర్ ప్ర‌తినిధి బృందంతో భేటీ
  • హైద‌రాబాద్‌లో సెంట‌ర్ ఏర్పాటుకు స్ప్రింక్ల‌ర్ సుముఖ‌త‌
తెలంగాణ‌కు భారీ పెట్టుబ‌డుల‌ను తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్క‌డ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న సాగిస్తున్న కేటీఆర్‌... శ‌నివారం న్యూయార్క్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ముఖ ఐటీ సంస్థ స్ప్రింక్ల‌ర్ కు చెందిన ప్ర‌తినిధి బృందంతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో భాగంగా తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌ల‌కు తాము అందిస్తున్న స‌హాయ స‌హ‌కారాల‌ను తెలియ‌జేసిన కేటీఆర్‌.. ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు హైద‌రాబాద్ హ‌బ్‌గా ఉంద‌న్న విష‌యాన్ని తెలిపారు. కేటీఆర్ ప్ర‌జెంటేష‌న్ విన్న స్ప్రింక్ల‌ర్ బృందం.. హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ ఆఫీస్‌ను నెల‌కొల్పేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న సెంట‌ర్‌లో 200 మంది ఐటీ ఉద్యోగుల‌తో ఓ బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.


More Telugu News