మ‌రో ఆరు నెల‌ల పాటు ఉచిత రేష‌న్.. కేంద్రం తాజా నిర్ణయం

  • క‌రోనా నేప‌థ్యంలో పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న‌
  • ఎప్ప‌టికప్పుడు పొడిగిస్తూ వ‌స్తున్న కేంద్రం
  • ఈ నెలాఖరుతో తాజా గ‌డువు పూర్తి కానున్న వైనం
  • ఈ క్ర‌మంలోనే మ‌రో ఆరు నెల‌ల పాటు ప‌థ‌కం పొడిగింపు
కేంద్ర ప్ర‌భుత్వం శ‌నివారం నాటి కేబినెట్ భేటీలో ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో దేశంలోని నిరుపేద‌ల‌కు ఉచిత రేష‌న్ పంపిణీని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. పీఎం గరీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న పేరిట ప్రారంభ‌మైన ఈ ప‌థ‌కాన్ని క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో ఎప్ప‌టికప్పుడు పొడిగిస్తూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజా పొడిగింపు కూడా ఈ నెలాఖ‌రుతో ముగియ‌నుంది.

ఈ నేప‌థ్యంలో శ‌నివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఉచిత రేష‌న్‌ను మ‌రో ఆరు నెల‌ల పాటు పొడిగిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో ఈ ఏడాది సెప్టెంబ‌ర్ దాకా పేద‌ల‌కు ఉచిత రేష‌న్ అంద‌నుంది. ఈ ప‌థ‌కం కింద దేశంలోని 80 కోట్ల మందికి ల‌బ్ధి చేకూర్చుతోంది. ఇదిలా ఉంటే.. యూపీ సీఎంగా వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన యోగి ఆదిత్య‌నాథ్ ఉచిత రేష‌న్‌ను మూడు నెల‌లు పొడిగిస్తూ శ‌నివారం నాటి త‌న తొలి కేబినెట్ భేటీలో నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే కేంద్రం ఈ ప‌థ‌కాన్ని ఆరు నెల‌ల పాటు పొడిగించ‌డంతో యూపీ ప్ర‌భుత్వంపై ఈ ప‌థ‌కం భారం ప‌డ‌దు.


More Telugu News