దేశంలో కొత్త‌గా 21 సైనిక్ స్కూళ్లు.. ఏపీ, తెలంగాణ‌ల‌కు ఒక్కో స్కూల్‌

  • 7 డే స్కాల‌ర్‌, 14 హాస్ట‌ల్ వ‌స‌తితో స్కూళ్లు
  • క‌డ‌ప‌లోని పూజ ఇంట‌ర్నేష‌నల్ స్కూల్‌కు చోటు
  • క‌రీంన‌గ‌ర్‌లోని సోష‌ల్ వెల్ఫేర్ స్కూల్‌కూ అవ‌కాశం
సైనిక్ స్కూళ్ల‌లో ప్ర‌వేశాల కోసం ఏ మేర డిమాండ్ వుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే న‌డుస్తున్న సైనిక్ స్కూళ్లకు అద‌నంగా మ‌రో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ శ‌నివారం నాడు ఆమోదం తెలిపింది. భాగ‌స్వామ్య పద్ధతిలో న‌డిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్ల‌లో 7 డే స్కూళ్లుగా ప‌నిచేయ‌నుండ‌గా.. 14 మాత్రం రెసిడెన్షియ‌ల్ మోడ్‌లో న‌డ‌వ‌నున్న‌ట్లు ఆ శాఖ ప్ర‌క‌టించింది.

ఇక కొత్త‌గా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్ల‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఒక్కోటి చొప్పున సైనిక్ స్కూళ్లు మంజూర‌య్యాయి. ఏపీలోని క‌డ‌ప జిల్లాకు చెందిన పూజ ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ సైనిక్ స్కూల్‌గా మార‌నుంది. ఇక తెలంగాణలో క‌రీంన‌గ‌ర్‌కు చెందిన సోష‌ల్ వెల్ఫేర్ స్కూల్‌ను సైనిక్ స్కూల్‌గా తీర్చిదిద్ద‌నున్నారు.


More Telugu News