ఓటీఎస్‌తో ఖజానాకు రూ.339 కోట్లు.. చిత్తూరు జిల్లాదే అగ్రస్థానం
- ఓటీఎస్‌ను వినియోగించుకున్న వారు 9.86 లక్షలు
- చంద్రబాబు సొంత జిల్లాలోనే అత్యధిక వసూళ్లు
- అత్యల్ప వసూళ్లతో చివరి స్థానంలో విజయనగరం జిల్లా
ఏపీ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి జనం నుంచి మంచి స్పందనే లభించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో కలిపి 9.86 లక్షల మంది లబ్ధిదారులు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకం కింద రూ.10 వేల వంతున చెల్లించి గృహాలను తమ పేరిట రిజిష్టర్ చేయించుకున్నారు. ఈ లెక్కన ఇప్పటిదాకా ఖజానాకు రూ.339 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ పథకాన్ని వినియోగించుకున్న అత్యధిక మంది లబ్ధిదారులు కలిగిన జిల్లాల జాబితాలో విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా టాప్‌లో నిలవడం గమనార్హం. ఈ జిల్లాలో ఈ పథకం ద్వారా ఖజానాకు ఏకంగా రూ.61 కోట్ల మేర సమకూరింది. ఆ తర్వాతి స్థానంలో రూ.41 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. ఇక నెల్లూరు జిల్లా (రూ.32 కోట్లు), ప్రకాశం జిల్లా (రూ.28 కోట్లు), గుంటూరు, కర్నూలు జిల్లాలు (రూ.25 కోట్లు), విశాఖపట్నం జిల్లా (రూ.23 కోట్లు) ఉన్నాయి. కేవలం రూ.12 కోట్ల వసూళ్లతో విజయనగరం జిల్లా ఈ జాబితాలో చివర్లో నిలిచింది.