ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే బీజేపీ నిజస్వరూపం వెల్లడైంది: హరీశ్ రావు

  • ధరల పెంపుతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని విమర్శలు
  • నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యలు
  • సామాన్యుడు అప్పుల పాలవుతున్నాడన్న మంత్రి   
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో మళ్లీ ధరలు మండిపోతున్నాయని అన్నారు. పెట్రోల్ ధరల పెంపు, గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలకు పెనుభారంలా మారాయని పేర్కొన్నారు. 

అటు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావంతో ఆదాయం లేక అల్లాడుతున్న ప్రజలను అధిక ధరలు అప్పులపాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక బీజేపీ నిజస్వరూపం వెల్లడైందని హరీశ్ రావు విమర్శించారు. ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని పేర్కొన్నారు. 

కాగా, ఇవాళ ఉదయం హరీశ్ రావు సతీసమేతంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఇక్కడి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సుప్రసిద్ధ శైవక్షేత్రంలో మొక్కులు తీర్చుకున్నారు.


More Telugu News