టీడీపీ ఆధ్వర్యంలో "కిల్లర్‌జేబ్రాండ్స్.కామ్"!.. ఈ సైట్‌లో ఏముంటుందంటే..!
- నాసిరకం మద్యంపై టీడీపీ డిజిటల్ క్యాంపెయిన్
- ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించిన వైనం
- మద్యం పాలసీ, దోపిడీ, మరణాల వంటి వివరాల అందజేత
- భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు
ఏపీలో నాసిరకం మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షం టీడీపీ ఇప్పుడు దీనిపై కొత్త పోరుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏకంగా ఓ వెబ్ సైట్‌నే రూపొందించి.. దానికి కిల్లర్‌జేబ్రాండ్స్.కామ్ పేరు పెట్టింది.
ఈ మేరకు శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, ఆచంట సునీతలు ఈ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సైట్‌లో ప్రభుత్వ మద్యం పాలసీ, మద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ, మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల వివరాలను పొందుపరుస్తున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ చేపట్టిన ఈ డిజిటల్ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వారు వెల్లడించారు.