రంగంలోకి బైడెన్.. ఉక్రెయిన్ మంత్రులతో అమెరికా అధ్యక్షుడి భేటీ
- పోలండ్ పర్యటనకు జో బైడెన్
- వార్సాలో ఉక్రెయిన్ మంత్రులతో భేటీ
- అంతకుముందే పోలండ్ అధ్యక్షుడితోనూ సమావేశం
ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు కీలక దేశాలు ఈ యుద్ధంలోకి నేరుగా ప్రవేశించకున్నా.. యుద్ధంలో తలపడుతున్న ఇరు దేశాల్లో దేనికో, ఒక దానికి మద్దతు పలికే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి మద్దతు సాధించడంలో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే అమెరికా, నాటో, ఈయూ దేశాల మద్దతు సాధించిన ఉక్రెయిన్.. రష్యాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా మరింతగా ఈ యుద్ధంపై దృష్టి సారించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పొరుగు దేశం పొలండ్‌లో పర్యటనకు బయలుదేరారు.
ఈ పర్యటనలో బైడెన్ పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు అమెరికా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి అందుతున్న సాయం పకడ్బందీగా చేరేలా చూడాలని డుడాను బైడెన్ కోరనున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులతోనూ బైడెన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి, విదేశాల నుంచి ఏ మేర సాయం కావాలన్న కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.