తిరుమలకు పోటెత్తిన భక్త కోటి... నిండిపోయిన క్యూ లైన్లు
- కరోనా తగ్గుదలతో తిరుమలకు పెరిగిన రద్దీ
- వారాంతంతో క్యూ లైన్లు నిండిపోయిన వైనం
- క్యూ లైన్లు, వసతి సముదాయాలను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి
ప్రాణాంతక వైరస్ కరోనా విస్తృతి పూర్తిగా మందగించకపోయినా.. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనే ఇచ్చాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో అసలు కొత్త కేసులేమీ నమోదు కావడం లేదు. అదే సమయంలో 98 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. వెరసి కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే నిమిత్తం భక్త కోటి తరలివస్తోంది.
వారాంతం నేపథ్యంలో శనివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో దాదాపుగా రెండేళ్ల తర్వాత సర్వ దర్శనం క్యూ లైన్లు నిండిపోయాయి. పరిస్థితిని అంచనా వేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్యూ లైన్లతో పాటు భక్తుల వసతి సముదాయాలను తనిఖీ చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాలు, ఆహారం అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.