ఓటీటీలో ‘ఆర్ఆర్ఆర్’.. ఎప్పుడు..దేంట్లో అంటే!

  • నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్త
  • జూన్ తర్వాతే బుల్లితెరపై బ్లాక్ బస్టర్ మూవీ
  • తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హక్కులు జీ5కి?
  • హిందీ వెర్షన్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్?
థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం మామూలుగా లేదు. తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్ల మోత మోగించింది. పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. థియేటర్లలో సినిమా నడుస్తుండగానే చాలా మంది అభిమానులు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

దానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. వాస్తవానికి సినిమాను విడుదలైన మూడు నెలలకు గానీ ఓటీటీలోకి తీసుకురాబోమని దర్శక దిగ్గజం రాజమౌళి ఇంతకుముందే చెప్పకనే చెప్పారు. దీంతో జూన్ తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుందని నెట్టింట్లో వార్త చక్కర్లు కొడుతోంది. 

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు సంబంధించి ‘జీ5’ ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని అంటున్నారు. మరి, ఆర్ఆర్ఆర్ ను బుల్లితెరపై చూడాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే. లేదూ అంటే థియేటర్ కు వెళ్లి చూడాల్సిందే.


More Telugu News