గుడిలో పూజారి హత్య కేసు ఛేదన.. ప్రధాన నిందితుడు తమ్ముడి కొడుకే!
- ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య
- మరో నలుగురితో కలిసి దారుణం
- మీడియా ముందుకు నిందితులు
గుడిలో పూజారి దారుణ హత్య కేసును ఏపీ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామ శివారులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొత్తలంక వెంకటనాగేశ్వరశర్మ అనే పూజారిని హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసును ఛేదించిన నిడదవోలు పోలీసులు.. పూజారి తమ్ముడి కుమారుడే హత్య చేసినట్టు నిర్ధారించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్.. మరో నలుగురితో కలిసి నాగేశ్వర శర్మను చంపినట్టు తేల్చారు.
నిందితులు సుమంత్ సహా కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన హనుమంతరావు, ఆలపాటి రాఘవ, తూర్పుగోదావరి జిల్లా ఎల్చేరుకు చెందిన సురేశ్, విజ్యేశ్వరానికి చెందిన షేక్ పీర్ మజీన్ లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ మీడియా ముందుకు తీసుకొచ్చారు.