రెండు కంపెనీల నుంచి వైదొలగిన అనిల్ అంబానీ
- రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్ పదవులకు రాజీనామా
- కంపెనీల నుంచి నిధులను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు
- ఏ లిస్టెడ్ కంపెనీలోనూ అనిల్ అంబానీ పదవులు నిర్వహించకూడదన్న సెబీ
రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్ పదవులకు అనిల్ అంబానీ రాజీనామా చేశారు. సెబీ ఆదేశాల మేరకు ఆయన తప్పుకున్నారు. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కూడా అనిల్ అంబానీ పదవులు నిర్వహించకూడదని సెబీ ఆదేశాలు జారీ చేసింది. కంపెనీల నుంచి నిధులను అక్రమంగా తరలించిన ఆరోపణల నేపథ్యంలో... అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, మరో ముగ్గురు వ్యక్తులపై సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ ఈ ఫిబ్రవరిలో నిషేధం విధించింది.
దీనికి తోడు రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలు, లిస్టెడ్ కంపెనీలు, పబ్లిక్ నుంచి నిధులు సమీకరించే కంపెనీలు తదితరాలలో ఎలాంటి పదవులు చేపట్టకూడదని నలుగురినీ ఆదేశించింది. తదుపరి ఆదేశాలను జారీ చేసేంత వరకు నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బోర్డు నుంచి అనిల్ అంబానీ వైదొలగినట్లు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటన చేశాయి.