యోగి ప్రమాణస్వీకారానికి హాజరు కాకపోవడానికి కారణం ఇదే: ఉమాభారతి
- ప్రమాణస్వీకారానికి హాజరు కావడానికి లక్నోకు వచ్చాను
- ట్రాఫిక్ కారణంగా వేదిక వద్దకు చేరుకోలేకపోయాను
- యోగి ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటున్నా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత ఉమాభారతి కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకాలేరు. తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని ఆమె వివరించారు.
యోగి ప్రమాణస్వీకారానికి హాజరు కావడానికి తాను లక్నోకు వచ్చానని, అయితే ట్రాఫిక్ జామ్ కారణంగా తాను ప్రమాణస్వీకార వేదిక వద్దకు చేరుకోలేకపోయానని తెలిపారు. యోగి ప్రభుత్వం విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని అభిలషించారు.
ఇక రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ జంబో కేబినెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీ, నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.