నేడూ తప్పని పెట్రో బాదుడు.. హైదరాబాద్‌లో రూ.111 దాటిన పెట్రోలు ధర
- ఐదు రోజుల్లో నాలుగోసారి పెరిగిన ధరలు
- నేడు పెట్రోలుపై 89, డీజిల్‌పై 86 పైసల పెంపు
- విజయవాడలో లీటరు పెట్రోలు రూ.113.60కి చేరిక
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గతేడాది నవంబరు 4వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 21 వరకు పెట్రో ధరల పెంపు ఊసెత్తని చమురు కంపెనీలు మళ్లీ ఎడాపెడా బాదేస్తున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి మళ్లీ పెంచేశాయి. ఇప్పటి వరకు లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన సంస్థలు ఈ రోజు మరికాస్త పెంచాయి.
పెట్రోలుపై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంచాయి. ఫలితంగా హైదరాబాద్‌లో ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ. 111.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ. 113.60 కాగా, డీజిల్ ధర రూ.99.50గా ఉంది. ఈ ఐదు రోజుల్లో పెట్రో ధరలు లీటరుకు రూ.3.20 పెరిగాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం ఆరు గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.