ఏపీలో తాజాగా 40 కరోనా కేసుల నమోదు
- గత 24 గంటల్లో 10,515 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 15 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 55 మంది
- ఇంకా 429 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 10,515 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలలో కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 55 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో మరణాలేవీ సంభవించలేదు.
ఏపీలో ఇప్పటివరకు 23,19,407 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,248 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 429 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 14,730 మంది మరణించారు.
.
ఏపీలో ఇప్పటివరకు 23,19,407 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,248 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 429 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 14,730 మంది మరణించారు.