'పుష్ప ' పార్టు 2 మాత్రమే కాదు .. 3 కూడా?
- సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
- సెకండ్ పార్టు దిశగా సన్నాహాలు
- జూన్ .. జూలైలలో షూటింగ్
- పార్టు 3 చేసే ఆలోచనలో సుకుమార్
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో 'పుష్ప' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బన్నీ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు.
ప్రస్తుతం ఈ సినిమా టీమ్ సెకండ్ పార్టుకు సంబంధించిన కథా చర్చలు చేయడానికి తమిళనాడులోని 'కూనూర్' వెళ్లిందట. అక్కడి నుంచి పూర్తి స్క్రిప్ట్ తోనే తిరిగి వస్తారట. జూన్ లో గానీ .. జులైలోగాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.
ఇక కొత్తగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ సినిమాకి 3వ పార్టు కూడా చేయాలనే ఆలోచనతో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. ఆ దిశగానే సెకండ్ పార్టును తీసుకు వెళ్లనున్నారని చెబుతున్నారు. సెకండ్ పార్టు తరువాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత 'పుష్ప 3' చేస్తారట. మొత్తానికైతే చేయడం మాత్రం ఖాయమన్నమాట!