సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి... సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సలహా
- న్యాయస్థానాల పరిధిపై సీఎం జగన్ వ్యాఖ్యలు
- న్యాయవ్యవస్థలను గౌరవించాలన్న కిషన్ రెడ్డి
- దెబ్బతీసే ప్రయత్నాలు వద్దని హితవు
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. న్యాయవ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సలహా ఇచ్చారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ కు ఆ హక్కు ఉందని స్పష్టం చేశారు. అంతేతప్ప వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నం చేయరాదని అన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ, పత్రికా వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.