నారా లోకేశ్ కు దమ్ముంటే గుడివాడలో నాపై పోటీ చేయాలి: మంత్రి కొడాలి నాని సవాల్
- జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్న నాని
- జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదని వ్యాఖ్య
- పది తప్పినా ఎమ్మెల్యేగా గెలిచానన్న మంత్రి
- న్యాయస్థానాలంటే జగన్ కు గౌరవం అని స్పష్టీకరణ
సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నారా లోకేశ్ కు ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. లోకేశ్ కు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలన్నారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు... జగన్ దాకా ఎందుకు... లోకేశ్ ను నాపై పోటీ చేసి గెలవమనండి చాలు అని స్పష్టం చేశారు.
అమెరికాలో చదవిన లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయాడని, తాను పదో తరగతి తప్పినా ఎమ్మెల్యేగా గెలిచానని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అయినా, జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. న్యాయస్థానాలపై తనకు ఎనలేని గౌరవం ఉందని జగన్ పేర్కొన్నారని కొడాలి నాని వివరించారు. సీఎంపై తప్పుడు ఆరోపణలు చేయడం కట్టిపెట్టాలని హితవు పలికారు.