2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేసిన జగన్... పూర్తి వివరాలు ఇవిగో!
- పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామన్న జగన్
- అందుకే తమను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని వ్యాఖ్య
- ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్ విడుదల
పేదల సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు. తాము చేస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతి ఎన్నికల్లో వైసీపీని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 2022-23 సంవత్సరానికి గాను ప్రజలకు అందే సంక్షేమ పథకాలపై జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించారు.
సంక్షేమ క్యాలెండర్ వివరాలు:
సంక్షేమ క్యాలెండర్ వివరాలు:
- 2022 ఏప్రిల్ - వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
- మే - విద్యా దీవెన, అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా
- జూన్ - అమ్మ ఒడి పథకం
- జులై - విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు
- ఆగస్ట్ - విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్టివ్ లు, నేతన్న నేస్తం
- సెప్టెంబర్ - వైఎస్సార్ చేయూత
- అక్టోబర్ - వసతి దీవెన, రైతు భరోసా
- నవంబర్ - విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
- డిసెంబర్ - ఈబీసీ నేస్తం, లా నేస్తం
- 2023 జనవరి - రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు
- ఫిబ్రవరి - విద్యా దీవెన, జగనన్న చేదోడు
- మార్చి - వసతి దీవెన.