మూడు రాజధానులు కావాలంటే మళ్లీ ప్రజాతీర్పు కోరాలా... ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి
- మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
- రాజీనామాలు చేసి ఎన్నికలకు పోవాలన్న చంద్రబాబు
- ఓసారి గెలిస్తే నిర్ణయాధికారం ఉండదా? అంటూ విజయసాయి ప్రశ్న
మూడు రాజధానులే తమ ప్రభుత్వ పంథా అని సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయడం, వైసీపీ నేతలు రాజీనామా చేసి మూడు రాజధానులపై మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేయడం తెలిసిందే. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
'మూడు రాజధానులు కావాలంటే మళ్లీ ప్రజాతీర్పు కోరాలా... ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబూ?' అంటూ మండిపడ్డారు. 'ఓసారి గెలిచినా రాజధానిపై నిర్ణయాధికారం ఉండదా?' అని ప్రశ్నించారు.
"ఇంత అయోమయం, అహంకారం ఎందుకు? మీ మైండ్ గజిబిజి అయితే అందరూ పిచ్చోళ్లయినట్టా? ముందే చేతులెత్తేసి, గుక్కపట్టి ఏడిస్తే సానుభూతి రాదు" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. నీతి లేని నాయకుడు ఎవరని భవిష్యత్ తరాలను అడిగితే చంద్రబాబునే చూపిస్తాయని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగంతో ఆయన చేసినన్ని అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరని, ఆఖరికి తన కుమారుడ్ని కూడా మహిళల పట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశారని చంద్రబాబును విమర్శించారు.