పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరికొన్ని షరతులు
- సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం షరతులు
- డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్ తయారు చేయాల్సిందేనని నిబంధన
- ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కోరిన కేంద్ర జల శక్తి శాఖ
ఏపీలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర సర్కారు మరికొన్ని షరతులు పెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం గురించి లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్ తయారు చేయాల్సిందేనని చెప్పారు. ఈ నిబంధనతో పాటు పోలవరానికి సంబంధించి మరోసారి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని పేర్కొంది.
ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022, ఫిబ్రవరి వరకు ఏపీ సర్కారు చేసిన ఖర్చు మొత్తం రూ.14,336 కోట్లని, తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రూ.12,311 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపింది. ఇంకా రూ.437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని తెలిపింది. అసలు పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో గడువు చెప్పాలని ఏపీ సర్కారుని కేంద్ర ప్రభుత్వం కోరడం గమనార్హం.