'ఆర్ఆర్ఆర్'పై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే..!
- 'ఆర్ఆర్ఆర్' ఒక టెర్రిఫిక్ సినిమా
- జూనియర్ ఎన్టీఆర్ నటన ఎక్సెప్షనల్
- రామ్ చరణ్ యాక్షన్ ఫెంటాస్టిక్
- రాజమౌళి మరోసారి అద్భుతం చేశారు
- భావోద్వేగాలు, దేశభక్తి సమ్మిళతమైన గొప్ప సినిమా
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన తారక్, చరణ్ అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు.
ట్విట్టర్ ద్వారా తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ... 'ఆర్ఆర్ఆర్' టెర్రిఫిక్ అంటూ ఒక్క మాటలో తేల్చేశారు. రాజమౌళి మరోసారి అద్భుతం చేశారని కితాబునిచ్చారు. భావోద్వేగాలు, దేశభక్తిని సమ్మిళితం చేసిన గొప్ప చిత్రమని కొనియాడారు. భారీ సక్సెస్ సాధించేందుకు అవసరమైన శక్తి, సామర్థ్యాలు ఈ సినిమాకు ఉన్నాయని చెప్పారు.
రాజమౌళి చిత్రాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని... 'ఆర్ఆర్ఆర్'లో కూడా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తరణ్ ఆదర్శ్ చెప్పారు. తారక్, రామ్ చరణ్ ల డ్యాన్స్, నటన అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నటన 'ఎక్సెప్షనల్' అని అన్నారు. ఈ చిత్రానికి కావాల్సినంత పవర్ ను జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడని చెప్పారు. రామ్ చరణ్ 'ఫెంటాస్టిక్' అని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్, డ్రామా సన్నివేశాలు ఎలక్ట్రిఫయింగ్ గా ఉన్నాయని చెప్పారు.
'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్ కు పెద్దగా స్కోప్ లేదని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అజయ్ దేవగణ్ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. శ్రీనివాస్ మోహన్ వీఎఫ్ఎక్స్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం పోశాయని అన్నారు. రెండో గంటలో సినిమా కొంచెం స్లో అయినప్పటికీ... క్లైమాక్స్ అదిరిపోయిందని తన రివ్యూలో తెలిపారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు.