ఆర్ఆర్ఆర్ ఫ్యాన్సీ షో టికెట్ల కోసం ఇద్దరు హీరోల అభిమానుల గొడవ.. శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత

  • శ్రీకాళహస్తిలో గందరగోళం
  • టికెట్లు తమకు కావాలంటే తమకు కావాలంటూ గొడవ
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
  • రక్త తిలకంతో హీరోల ఫొటోలను ఊరేగించిన అభిమానులు
ఆర్ఆర్ఆర్ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్సీ టికెట్ల విషయంలో ఇద్దరు హీరోల అభిమానులు పట్టుబట్టడంతో శ్రీకాళహస్తిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక థియేటర్‌కు చేరుకున్న ఓ హీరో అభిమానులు తమకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని గొడవకు దిగారు. విషయం తెలిసిన మరో హీరో అభిమానులు కూడా థియేటర్ వద్దకు చేరుకుని తమకు కూడా అధిక మొత్తంలో టికెట్లు కావాలని యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు.

దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో థియేటర్ తలుపు, అద్దాలకు అమర్చిన హ్యాండిళ్లను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సినిమా హాలు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, సినిమా విడుదల సందర్భంగా స్థానిక పద్మశాలిపేటకు చెందిన అభిమానులు ఇద్దరు హీరోల ఫొటోలకు రక్త తిలకం దిద్ది ర్యాలీ నిర్వహించారు.


More Telugu News