ఆదాయం పెంచడం చేతకాక.. మహిళల తాళిబొట్లు తెంచుతారా?: సాదినేని యామినీ శర్మ
- మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు
- మద్యాన్ని అమ్మకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం విడ్డూరం
- ప్రజలను తాగుడుకు బానిసలు చేసి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారన్న యామిని
రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించడం చేతకాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామినీశర్మ ఆరోపించారు. మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడేమో మద్యం అమ్మకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
నవరత్నాలను అమలు చేసేందుకు ప్రజల్ని తాగుడుకు బానిసలను చేసి మహిళల మెడలోని తాళిబొట్లను తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలపై సంక్షేమ పథకాల్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టార్జితం నుంచి పది రెట్ల సొమ్మును వసూలు చేసి ఒక్క శాతం సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్నారని యామిని దుయ్యబట్టారు.