మారుతి సుజుకి కొత్త ఎండీగా హిసాషి టకూచి

  • ముగియనున్న ప్రస్తుత  ఎండీ, సీఈవో కెనిచి అయుకవా పదవీకాలం
  • ఇకపై పూర్తికాల డైరెక్టర్‌గా కొనసాగింపు
  • 1986 నుంచి మారుతిలో పనిచేస్తున్న టకూచుని
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ)కి కొత్త ఎండీ, సీఈవో వచ్చేశారు. ప్రస్తుత ఎండీ, సీఈవో కెనిచి అయుకవా పదవీ కాలం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సారథిగా హిసాషి టకూచిని నియమించినట్టు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అయుకవా పూర్తికాల డైరెక్టరుగా కొనసాగుతారని మారుతి తెలిపింది. 

అలాగే, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో ఆయన ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంటారని, కంపెనీకి మార్గనిర్దేశనం చేస్తారని పేర్కొంది. 1986 నుంచి టకూచి మారుతిలో పనిచేస్తున్నారు. తొలుత అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే ఆయన జులై 2019 నుంచి మారుతి సుజుకి బోర్డులో కొనసాగుతున్నారు. ఏప్రిల్ 2021 నుంచి జాయింట్ ఎండీ (కమర్షియల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


More Telugu News