హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా ప్రియమే.. ఇక కప్పు రూ. 20

  • హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే ఇరానీ చాయ్
  • కప్పు టీ ధర రూ. 15 నుంచి రూ. 20కి పెంపు
  • చాయ్ పొడి ధర పెరగడమే కారణమంటున్న హోటళ్ల నిర్వాహకులు
హైదరాబాద్ అనగానే చటుక్కున గుర్తొచ్చేది ఇరానీ చాయ్. నగరానికి వచ్చిన వారు ఒక్కసారైనా దాని రుచి చూడాలనుకుంటారు. రంగు, రుచి, చిక్కదనంతోపాటు దానిలోని మరేదో ప్రత్యేకత చాయ్ ప్రియులను కట్టిపడేస్తుంది. ఇప్పుడీ చాయ్ ధర కూడా పెరిగింది. 

నిత్యావసరాల ధరలు ఎడాపెడా పెరుగుతున్న నేపథ్యంలో ఇరానీ చాయ్ ధరను కూడా రూ. 5 పెంచేశారు. ఫలితంగా ఇప్పటి వరకు రూ. 15గా ఉన్న కప్పు టీ ధర రూ. 20కి చేరింది. ఇరానీ చాయ్‌పొడి ధర కిలో రూ.300 నుంచి రూ. 500కు పెరగడమే ఇందుకు కారణమని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.


More Telugu News