ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్రస్థానంపై కన్నేసిన బాబా రాందేవ్

  • పతంజలి గ్రూప్, రుచి సోయాల టర్నోవర్ రూ.35 వేల కోట్లు
  • ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్నామన్న రాందేవ్
  • ఐదేళ్లలో అగ్రస్థానం తమదేనని ధీమా
ఆయుర్వేదం నేపథ్యంలో పతంజలి గ్రూప్ ఉత్పాదనలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని ఆ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. తమ పతంజలి ఆయుర్వేద గ్రూప్, రుచి సోయా (వంటనూనెల సంస్థ) కంపెనీల వార్షిక టర్నోవర్ రూ.35 వేల కోట్లు అని వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్రస్థానానికి ఎదగడమే తమ కంపెనీల లక్ష్యమని బాబా రాందేవ్ ఉద్ఘాటించారు. ప్రస్తుతం తాము రెండోస్థానంలో ఉన్నామని చెప్పారు. తొలి స్థానంలో హిందూస్థాన్ యూనీ లీవర్ ఉందని వివరించారు. 

కాగా, పతంజలి ఆయుర్వేద గ్రూప్ కింద ఉన్న ఫుడ్ బిజినెస్ ను రుచి సోయా కంపెనీకి బదలాయిస్తున్నట్టు తెలిపారు. పతంజలి ఆయుర్వేద గ్రూప్ ఇకపై సంప్రదాయ ఔషధాలు, కాస్మెటిక్స్, ఆహారేతర ఉత్పత్తులను మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు.


More Telugu News