అమరావతిలో మిగిలింది 7,300 ఎకరాలే: బొత్స కీలక వ్యాఖ్య
- రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించిన టీడీపీ సర్కారు
- మిగిలిన 7,300 ఎకరాలు అమ్మితే లక్ష కోట్లు వస్తాయా? అన్న బొత్స
- చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్లు
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్య చేశారు. అమరావతి నిర్మాణం కోసం రాజధాని రైతులు ఏకంగా 33 వేల ఎకరాల మేర భూములను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ భూముల్లో ప్రస్తుతం మిగిలిన భూములు కేవలం 7,300 ఎకరాలు మాత్రమేనని బొత్స పేర్కొన్నారు. ఈ మాత్రం భూములు అమ్మితే లక్ష కోట్ల రూపాయల నిధులు సమకూరుతాయా? అంటూ ఆయన ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించారు.
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వెనువెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ జగన్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన బొత్స పై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే మూడు రాజధానుల చట్టం చేశామని చెప్పిన బొత్స.. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.