జగన్ వ్యాఖ్యలపై టీడీపీ వైరల్ ట్వీట్!
- రాజధానిపై హైకోర్టు తీర్పు మీద జగన్ వ్యాఖ్యలు
- ఆ వెంటనే మీడియా ముందుకు చంద్రబాబు
- టీడీపీ ట్విట్టర్ వాల్‌పై ఆసక్తికరమైన పోస్ట్
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ ప్రకటనపై విపక్ష టీడీపీ చాలా వేగంగా కౌంటర్లు ఇచ్చేసింది. జగన్ ప్రసంగం ముగిసీ ముగియగానే మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జగన్‌ను టార్గెట్ చేశారు.
ఓ వైపు చంద్రబాబు మీడియా సమావేశం కొనసాగుతుండగానే.. టీడీపీ సోషల్ మీడియా ట్విట్టర్ వాల్‌పై ఓ ఆసక్తికరమైన ట్వీట్ కనిపించింది. చట్టసభలు చేసే చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్ట్ ఆఫ్ లా చెప్పేంత వరకు మాత్రమే అది చెల్లుబాటు అవుతుందని సదరు ట్వీట్‌లో టీడీపీ పేర్కొంది. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని తెలుపుతూ.. ఆ వ్యాఖ్యల పక్కనే సుప్రీంకోర్టు ఫొటోను యాడ్ చేసిన ట్వీట్ పోస్టర్‌ను టీడీపీ విడుదల చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.