ఢిల్లీ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం.. అధికార పార్టీ స‌భ్యుడికి విప‌క్ష నేత బ‌హుమ‌తి

  • రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ ఛ‌ద్దా
  • ఢిల్లీ అసెంబ్లీకి వీడ్కోలు ప‌లికిన యువ నేత‌
  • త‌న పెన్నును బ‌హుమానంగా ఇచ్చిన విప‌క్ష నేత రామ్‌వీర్‌
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికార పార్టీగా కొన‌సాగుతున్న ఢిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న ఆప్ నేత రాఘ‌వ్ ఛ‌ద్దాను ఆ పార్టీ ఇటీవ‌లే రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాఘ‌వ్ ఛ‌ద్దా గురువారం నాడు అసెంబ్లీకి వీడ్కోలు ప‌లికేశారు. 

ఈ సంద‌ర్భంగా రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టేసిన బీజేపీ నేత‌, స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత‌గా ఉన్న రామ్‌వీర్ సింగ్ బిధురీ.. రాఘ‌వ్‌కు త‌న పెన్నును బ‌హూక‌రించి యువ నేత‌కు వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రామ్‌వీర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న త‌న ఫొటోను రాఘ‌వ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా మ‌న చ‌ట్ట‌స‌భ‌ల్లో ఇలాంటి మంచి సంప్ర‌దాయాలు క‌దా ఉండాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు.


More Telugu News