తెలంగాణ‌కు మ‌రో రూ.1,000 కోట్ల పెట్టుబ‌డి

  • చేప‌ల ఎగుమ‌తిలో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా ఫిషిన్‌
  • తెలంగాణ‌లో ఫ్రెస్ వాట‌ర్ ఫిష్ క‌ల్చ‌ర్ సిస్ట‌మ్ ఏర్పాటుకు అంగీకారం
  • కేటీఆర్ స‌మ‌క్షంలో కుదిరిన ఒప్పందం
  • ఈ కంపెనీ రాక‌తో 5 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు
తెలంగాణ‌కు మ‌రిన్ని పెట్టుబడులు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆర్ కంపెనీల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు త‌మ కేంద్రాల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేసే దిశ‌గా ఆయా కంపెనీల యాజ‌మాన్యాల‌ను ఒప్పించారు. అందులో భాగంగా తాజాగా గురువారం నాడు మ‌రో కీల‌క పెట్టుబ‌డిని కేటీఆర్ సాధించారు. తెలంగాణ‌లో రూ.1,000 కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు ఫిషిన్ అనే సంస్థ అంగీక‌రించింది. అంతేకాకుండా కేటీఆర్ స‌మ‌క్షంలోనే తెలంగాణ ప్ర‌భుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఫిషిన్ కంపెనీకి ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా చేప‌ల‌ను ఎగుమ‌తి చేసే సంస్థ‌గా పేరుంది. ఈ సంస్థ ప్ర‌త్యేకించి తిలాపియా చేప‌ల‌ను ఎగుమ‌తి చేస్తుంద‌ట‌. ఈ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ.1,000 కోట్ల‌ను వెచ్చించ‌నుంది. ఈ కంపెనీ ప్లాంట్ ద్వారా ఏకంగా 5 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని స‌మాచారం.


More Telugu News