హైదరాబాదులో 'వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో' ప్రారంభం

  • బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షో
  • నాలుగు రోజుల పాటు ఎయిర్ షో
  • ఎయిర్ షోలో పాల్గొన్న ఎయిర్ బస్, ప్రాట్ అండ్ విట్నీ
  • ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ బస్-350
హైదరాబాదు నగరంలో భారీ ఎయిర్ షో షురూ అయింది. వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో నేడు బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్ షోను కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఎయిర్ షోలో ఎయిర్ బస్, ప్రాట్ అండ్ విట్నీ వంటి ప్రఖ్యాత విమాన తయారీ కంపెనీలు, విమాన ఇంజిన్ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. ఎయిర్ బస్ కొత్త విమానం ఎయిర్ బస్-350 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఆయా కంపెనీల ప్రతినిధులు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. ఎయిర్ బస్ వర్గాలు స్పందిస్తూ, భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని, రాబోయే 20 ఏళ్లలో 2,210 ఎయిర్ బస్ విమానాలను భారత్ కు అందజేస్తామని తెలిపాయి. విమాన ఇంజిన్ తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ స్పందిస్తూ, వచ్చే నెలలో బెంగళూరులో తమ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
.


More Telugu News