పార్లమెంటు సమీపంలో.. కేరళ కాంగ్రెస్ ఎంపీపై పోలీసు దెబ్బ
- కే రైల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
- అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
- ఇరువర్గాల మధ్య తోపులాట
- కాంగ్రెస్ ఎంపీ హిబి ఇడెన్ పై చేయి చేసుకున్న పోలీసులు
పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో భాగంగా గురువారం కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీపై ఢిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేరళలో త్వరలో ప్రారంభం కానున్న కేరైల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హిబి ఇడెన్‌పై పోలీసులు చేయి చేసుకున్నారు.
పార్లమెంటు సమీపంలోని విజయ్ చౌక్ వద్ద కే రైల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనకు దిగాయి. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం.. మరోపక్క అక్కడికి సమీపంలోనే విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు.
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఆ పార్టీ శ్రేణులను అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా.. తమతో వాదిస్తున్న హిబి ఇడెన్ చెంప చెళ్లుమనేలా ఓ పోలీస్ పంచ్ విసిరారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన ఇడెన్ ఈ విషయంపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదించనున్నట్లుగా తెలిపారు.