వైయస్ఆర్ ఎర్రబోళ్లు భూములు కాపాడితే.. కేసీఆర్ మైనింగ్ కోసం తాకట్టుపెట్టిండు: షర్మిల
- ఎస్టీలు, గొర్రెల కాపరుల భూముల జోలికొస్తే ఊరుకోబోం
- అక్రమ మైనింగ్ పై పోరాడుతాం
- అందరికీ వైయస్సార్టీపీ అండగా ఉంటుంది
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆమె పాదయాత్ర ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం పారుపల్లిలో ప్రారంభమయింది. పాదయాత్ర సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎస్టీలు, గొర్రెల కాపరుల భూముల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ లపై పోరాడుతామని చెప్పారు.
ఆత్మకూరులోని ఎర్రబోళ్లు భూముల్ని రక్షిస్తామని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఎర్రబోళ్లు భూములను కాపాడితే... మైనింగ్ కోసం కేసీఆర్ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పారుపల్లి గ్రామ పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని అన్నారు. అందరం కలసి పోరాడుదామని చెప్పారు. అందరికీ వైయస్సార్టీపీ అండగా ఉంటుందని చెప్పారు.