చైనా విమాన ప్రమాదం వెనుక సూసైడ్ మిషన్?

  • గత సోమవారం కూలిపోయిన విమానం
  • 132 మంది ప్రయాణికుల మృతి
  • పైలట్ అనారోగ్యం బారిన పడి ఉండొచ్చనీ అనుమానం
చైనా విమాన ప్రమాదంపై ఎన్నెనో అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం 132 మందితో బయల్దేరిన చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737–800 విమానం నిట్టనిలువునా దూసుకెళ్లి కొండల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. కూలిపోయే సమయంలో ధ్వని వేగానికి సమానంగా విమానం దూసుకురావడంతో విమానంలోని అందరూ చనిపోయారు. 

అయితే, ప్రమాదానికి గల కారణాలేంటన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానంలోని వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం, పరికరాల్లో లోపాల కారణంగా విమానం కూలిపోయి ఉండొచ్చని తొలుత అధికారులు అంచనాకు వచ్చారు. అయితే, పైలట్ కు ఆరోగ్యం బాగాలేని కారణంగా కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేదంటే ఉగ్రవాద చర్య ఏమైనా ఉందా? సూసైడ్ మిషన్ అయి ఉంటుందా? అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే విమానంలోని బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసలు నిజం ఏంటన్నది త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు. 



More Telugu News