అమెరికా విదేశాంగ శాఖ తొలి మహిళా మంత్రి మృతి

  • కేన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస
  • క్లింటన్ హయాంలో బాధ్యతలు
  • బాల శరణార్థిగా అమెరికాకు వచ్చిన మెడలీనా
అమెరికా విదేశాంగ శాఖ తొలి మహిళా మంత్రి మెడలీనా ఆల్ బ్రైట్ కన్నుమూశారు. చెకోస్లోవేకియాలో జన్మించిన ఆమె.. నాజీల చెర నుంచి తప్పించుకుని బాల శరణార్థిగా అమెరికాకు వచ్చి.. దేశ విదేశాంగ శాఖ మంత్రిగా ఎదిగారు. ఇప్పుడున్న చాలా మంది మహిళా రాజకీయ నేతలకు మార్గదర్శిగా ఎన్నో విలువైన సూచనలు చేశారు. 

84 ఏళ్ల వయసున్న ఆమె కేన్సర్ తో పోరాడుతూ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం ఉన్నంత వరకూ ఆమె డెమోక్రాట్ అభ్యర్థిగానే ఉన్నారు. రిపబ్లికన్లను తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 

తొలిసారిగా 1996లో ఆమెను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ నియమించారు. ఆ పదవిని చేపట్టిన రెండో మహిళగా ఇప్పటికీ ఆమె పేరునే రికార్డుంది. 

ఆయన హయాంలోనే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ తర్వాత అధ్యక్ష పదవి రేసులో ఆమె పేరు వినిపించినా.. ఆమె పుట్టిన దేశం ప్రేగ్ కావడంతో అధ్యక్ష పదవికి అవకాశం లేకుండా పోయింది. కాగా, జర్నలిస్ట్ జోసఫ్ ఆల్ బ్రైట్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ముగ్గురు కూతుర్లున్నారు. అనంతరం 1983లో సఖ్యత లేక భర్త నుంచి ఆమె విడిపోయారు. మెడలీనా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


More Telugu News