ప్రధాని మోదీతో భగవంత్ మాన్ మర్యాదపూర్వక భేటీ!
- ఢిల్లీ పర్యటనలో పంజాబ్ సీఎం మాన్
- ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
- మరికాసేపట్లో కేజ్రీవాల్‌తోనూ మీటింగ్
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం గురువారం ఢిల్లీలో ల్యాండైన మాన్.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన మాన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. ఎన్నికల్లో ఆప్ భారీ విక్టరీ సాధించిన వైనంపై మాన్‌కు మోదీ గ్రీటింగ్స్ కూడా చెప్పారు. కేంద్రం నుంచి పంజాబ్‌కు అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందించనున్నట్లుగా కూడా మోదీ చెప్పినట్టు సమాచారం.
ఆయా రాష్ట్రాలకు కొత్తగా ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన నేతలు.. ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుస్తున్న వైనం తెలిసిందే. అందులో భాగంగానే పంజాబ్‌లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాన్ కూడా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగానే కలిశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భేటీలో ఇతరత్రా ఏ అంశాలు కూడా చర్చకు వచ్చిన దాఖలా కనిపించలేదు. మోదీతో భేటీ ముగించుకున్న మాన్ మరికాసేపట్లో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలవనున్నారు.