ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు.. ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
- 2014లో హుజూర్ నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు
- నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ
- 28న విచారణకు రావాలని జగన్‌కు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హైదరాబాద్, నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు పంపింది. విచారణ నిమిత్తం ఈ నెల 28న న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంపై ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ జరుపుతోంది. కాగా, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీతో పాటు తెలంగాణలోనూ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని ఆరోపణలు వచ్చాయి.