తొలి విడ‌త‌లో 30,453 పోస్టుల భ‌ర్తీ.. తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్‌

  • గ్రూప్ 1లో 503 పోస్టులు
  • అత్య‌ధికంగా పోలీసు శాఖ‌లో 16,587 పోస్టులు
  • వైద్య ఆరోగ్య శాఖ‌లో 2,662 పోస్టులు
  • త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్న నోటిఫికేష‌న్లు
తెలంగాణ‌లో 80 వేల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీకి స్వ‌యంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. సీఎం ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. తొలి విడ‌త‌లో 30,453 ఉద్యోగాల భ‌ర్తీకి బుధ‌వారం ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి వ‌చ్చేసింది. 

తొలి విడ‌త‌గా భ‌ర్తీ కానున్న ఈ ఉద్యోగాల్లో గ్రూప్ 1 కింద 503 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోలీసు నియామ‌క సంస్థ ద్వారా భ‌ర్తీ కానున్న‌ జైళ్ల శాఖ‌కు చెందిన‌ 154  పోస్టులు, పోలీసు శాఖ‌లో 16,587 పోస్టులు, టీఎస్పీఎస్సీ ద్వారా జైళ్ల శాఖ‌లో భ‌ర్తీ కానున్న 31 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖ‌లో 2,662 పోస్టులతో పాటు మ‌రికొన్ని శాఖ‌ల‌కు చెందిన పోస్టులు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఆర్థిక శాఖ ఆయా ఉద్యోగ నియామ‌క సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ క్లియ‌రెన్స్‌తో త్వ‌ర‌లోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్నాయి.


More Telugu News