తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచే అమలు

  • గృహ వినియోగంపై యూనిట్‌కు 50 పైస‌ల పెంపు
  • ప‌రిశ్ర‌మ‌ల‌కు యూనిట్‌పై రూ.1 పెంపు
  • చార్జీల పెంపున‌కు ఈఆర్‌సీ గ్రీన్ సిగ్న‌ల్‌
తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల పెంపున‌కు రంగం సిద్ధ‌మైపోయింది. విద్యుత్ చార్జీల పెంపున‌కు సంబంధించి ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ (ఈఆర్‌సీ) బుధ‌వారం నాడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. విద్యుత్ చార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌ల‌పై రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలిపిన క‌మిష‌న్‌.. చార్జీల పెంపున‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు పేర్కొంది.

ప్ర‌భుత్వం నుంచి త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు విద్యుత్ చార్జీల పెంపున‌కు అనుమ‌తిస్తున్న‌ట్లుగా క‌మిష‌న్ చెప్ప‌డంతో విద్యుత్ చార్జీల పెంపుపై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డ‌మే త‌రువాయి విద్యుత్ బిల్లుల మోత మోగ‌నుంది. క‌మిష‌న్ వెల్ల‌డించిన మేర‌కు గృహ వినియోగ‌దారుల‌కు యూనిట్‌పై 50 పైస‌లు, పారిశ్రామిక వినియోగంపై యూనిట్‌కు రూ.1 పెర‌గ‌నున్నాయి. ఈ పెరిగిన ధ‌ర‌లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.


More Telugu News