ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- ఏపీ శాసనసభలో బిల్లు ప్రతిపాదన
- ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అసెంబ్లీ
- ఇకపై ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ
ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వెరసి ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ కొనసాగనుంది.
శాసనసభ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికార భాషగా గుర్తింపు ఇవ్వనున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనకు అనుగుణంగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. పలు బిల్లుల మాదిరిగానే ఉర్దూ బిల్లును కూడా అసెంబ్లీ ముందు పెట్టింది. బుధవారం నాటి సమావేశాల్లో భాగంగా ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.