లాలూ బాగానే వున్నారంటూ.. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి

  • తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఎయిమ్స్‌కు లాలూ
  • గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ
  • లాలూ పూర్తి ఫిట్‌గా ఉన్నార‌న్న ఎయిమ్స్ వైద్యులు
  • తెల్ల‌వారుజామున డిశ్చార్జీపై ఆర్జేడీ ఆగ్ర‌హం
ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం మంగ‌ళ‌వారం రాత్రి విష‌మించిందంటూ వార్తలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ను మంగ‌ళ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. అయితే లాలూకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ఎయిమ్స్ వైద్యులు ఆయ‌న పూర్తి ఆరోగ్యంతో ఉన్నార‌ని తేల్చేసి బుధ‌వారం తెల్ల‌వారుజామున 3.30 గంట‌ల‌కు డిశ్చార్జీ చేసి తిరిగి రాంచీ రిమ్స్‌కు త‌ర‌లించారు.

ఈ త‌ర‌హా ప‌రిణామాల‌పై ఆర్జేడీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అనారోగ్యంతో ఎయిమ్స్‌కు త‌ర‌లించిన లాలూ పూర్తి ఫిట్‌గా ఉన్నా గానీ.. తెల్ల‌వారుజామునే డిశ్చార్జీ చేయాల్సిన అవ‌సరం ఏమొచ్చింద‌ని వ్యాఖ్యానించింది. 

దాణా కుంభ‌కోణంలో దోషిగా తేలిన లాలూ ప్ర‌స్తుతం జైలు శిక్ష అనుభ‌విస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే గుండె, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న లాలూను రాంచీలోని రిమ్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డం, ఆ వెంట‌నే ఆయ‌న‌ను ఎయిమ్స్‌కు త‌ర‌లించ‌డం, ఆ వెంట‌నే ఫిట్‌గా ఉన్నారంటూ ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జీ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.


More Telugu News