బాడీ షేమింగ్ గురించి రాశీ ఖన్నా స్పందన!

  • తొలి నాళ్లలో నన్ను బాడీ షేమింగ్ చేశారు
  • గ్యాస్ ట్యాంకర్ వంటి పదాలతో కామెంట్ చేసేవారు
  • తొలి రోజుల్లో ఫీలైనా, తర్వాత లైట్ గా తీసుకున్నానన్న రాశి 
ఢిల్లీ భామ రాశీ ఖన్నా దక్షిణాదిన సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం అవుతోంది. తాజాగా 'రుద్ర' అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆమె పలకరించింది. మరోవైపు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి వివరించింది. దక్షిణాదిలో తాను హీరోయిన్ గా పరిచయం అయిన తొలినాళ్లతో తనను బాడీ షేమింగ్ చేశారని ఆమె తెలిపింది. 

తనను గ్యాస్ ట్యాంకర్ వంటి పదాలతో కామెంట్ చేసేవారని చెప్పింది. తాను కొంచెం బొద్దుగా ఉండటం వల్ల అలా అనేవారని.. తాను మాత్రం వాళ్లకు జవాబు ఇవ్వలేకపోయేదాన్నని తెలిపింది. హీరోయిన్ గా కొనసాగాలంటే సన్నగా ఉండాలని తెలుసుకున్నాక... తాను బరువు తగ్గానని చెప్పింది.

అయితే, తనకు తానుగా బరువు తగ్గానని... ఎవరో అన్నారని తాను సన్నబడలేదని తెలిపింది. తనకు పీసీఓడీ సమస్య ఉందనే విషయం కూడా తెలుసుకోకుండానే కామెంట్లు చేసేవారని చెప్పింది. తొలి రోజుల్లో బాధగా అనిపించినప్పటికీ ఆ తర్వాత లైట్ గా తీసుకున్నానని తెలిపింది.


More Telugu News