ఉత్త‌రాఖండ్ సీఎంగా పుష్క‌ర్ సింగ్ ధామి ప్ర‌మాణం

  • ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచినా ఓడిన ధామి
  • ఆయనకే మ‌రోమారు అవ‌కాశ‌మిచ్చిన బీజేపీ
  • ప్రమాణం చేయించిన గ‌వ‌ర్న‌ర్ గుర్మీత్ సింగ్ 
ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రిగా బీజేపీ కీల‌క నేత పుష్క‌ర్ సింగ్ ధామి కాసేప‌టి క్రితం ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా ప‌లువురు బీజేపీ కీల‌క నేత‌లు హాజ‌ర‌య్యారు. ఉత్త‌రాఖండ్ గ‌వ‌ర్న‌ర్ గుర్మీత్ సింగ్.. పుష్క‌ర్ సింగ్ ధామితో ప‌ద‌వీ ప్ర‌మాణం చేయించారు. 

ఇటీవ‌లే ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా పంజాబ్ మిన‌హా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజ‌యం సాధించింది. ఆ నాలుగింటిలో ఒక‌టైన ఉత్త‌రాఖండ్‌లో బీజేపీ విజయం సాధించినా.. అప్ప‌టికే ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న పుష్క‌ర్ సింగ్ ధామి మాత్రం ఓడిపోయారు. 

దీంతో పుష్క‌ర్ సింగ్ ధామిని మార్చి ఉత్త‌రాఖండ్ సీఎంగా మ‌రొక‌రికి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనా.. పుష్క‌ర్‌కే ఉత్త‌రాఖండ్ సీఎం ప‌గ్గాలు అప్ప‌గించారు. వెర‌సి ఉత్త‌రాఖండ్‌కు వ‌రుస‌గా రెండో సారి సీఎంగా పుష్క‌ర్ సింగ్ ధామి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ట్టయింది.


More Telugu News