టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు గంభీర్ వార్నింగ్
- ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసినంత మాత్రాన.. టీమిండియా కెప్టెన్సీకి గ్యారంటీ లేదు
- మైదానంలో నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి
- కొన్నికొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సిందే
- అదే మన సక్సెస్ ను నిర్ధారిస్తుందని కామెంట్
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. లక్నో సూపర్ జయంట్స్ (ఎల్ఎస్జీ)కు రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదే జట్టుకు గంభీర్ మెంటర్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ కు హెచ్చరికలు పంపాడు.
ఐపీఎల్ లో జట్టుకు కెప్టెన్ గా ఉన్నంత మాత్రాన.. టీమిండియా కెప్టెన్సీకి గ్యారంటీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ రాహుల్ కు చురకంటించాడు. ఎల్ఎస్జీకి కావాల్సింది జట్టును నడిపించే బ్యాటర్ కానీ.. బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాదని అన్నాడు. ఈ రెండింటి మధ్య తేడాను రాహుల్ అర్థం చేసుకుంటాడని భావిస్తున్నానని చెప్పాడు.
జట్టుకు అధిపతి కెప్టెనేనని, ఎల్ఎస్జీకి మైదానం లోపల, వెలుపల రాహుల్ దే బాధ్యతని చెప్పాడు. మైదానంలో నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని, దాని కోసం అతడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపాడు. కెప్టెన్ అనేవాడు కచ్చితంగా రిస్క్ తీసుకోవాలని, రాహుల్ కు తాను అదే సూచిస్తున్నానని పేర్కొన్నాడు.
సరైన రిస్క్ లు తీసుకోకపోతే తీసుకున్న నిర్ణయాలపై విజయం సాధిస్తామో లేదో తెలియదన్నాడు. ఇప్పుడు జట్టుకు కీపింగ్ కోసం క్వింటన్ డికాక్ ఎలాగూ ఉన్నాడు కాబట్టి.. ఇక కీపింగ్ బాధ్యతలు రాహుల్ పై ఉండబోవని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ కు చెప్పాడు. తద్వారా బ్యాటింగ్, నాయకత్వంపై దృష్టి సారించాలని సూచించాడు.
టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ అనడానికి.. టీమిండియాకు కెప్టెన్ అనడానికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని గంభీర్ సూచించాడు. జాతీయ జట్టుకు ఆడుతూ ఐపీఎల్ లో ఆడతామని ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు. తనను తాను నిరూపించుకోవడానికి ఐపీఎల్ చక్కటి వేదిక అని చెప్పాడు. కెప్టెన్ గా ఎదిగేందుకు తోడ్పడుతుందని, అలాగని జాతీయ జట్టుకు కెప్టెన్ అవుతామన్న గ్యారంటీ ఉండదని తేల్చి చెప్పాడు.
జట్టు కూర్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండేలా చూసుకున్నామని గంభీర్ చెప్పాడు. వేలం సందర్భంలో ఇదే విషయాన్ని జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు చెప్పామన్నాడు. తన మాటకు సంజీవ్ ఎంతో విలువనిచ్చారని, అంత గౌరవం ఇస్తారని కనీసం ఊహించలేదని అన్నాడు. అందువల్లే జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా వంటి ఆల్ రౌండర్లను జట్టులోకి తీసుకోగలిగామని తెలిపాడు.