హీరో మోటోకార్ప్ చైర్మన్, ఎండీ ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులు
- ఇవాళ తెల్లవారుజాము నుంచే దాడులు
- ఇప్పటికీ కొనసాగుతున్న సోదాలు
- అదే ఏరియాలోని సంస్థ ఇతర అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు
హీరో మోటోకార్ప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ ఇల్లు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే గురుగ్రామ్ లో సోదాలు మొదలుపెట్టారు. ఇప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలోనే ఉంటున్న సంస్థ ఇతర ఉన్నతాధికారుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
2001లో ఒక క్యాలెండర్ ఇయర్ కు సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక ద్విచక్రవాహనాలను అమ్మిన సంస్థగా హీరోమోటోకార్ప్ రికార్డు సృష్టించింది. 20 ఏళ్లుగా ఆ రికార్డును కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పటిదాకా సంస్థ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల యూనిట్లను అమ్మింది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ, మధ్య అమెరికాల్లోని 40 దేశాల్లో హీరో తన వాహన శ్రేణిని విక్రయిస్తోంది. ఇక, మన దేశంలో ద్విచక్రవాహన విభాగంలో అదే రారాజుగా ఉంది.