మొదటి 20 నిమిషాల్లోనే ఎన్టీఆర్, చరణ్ లను ఫాలో అవుతారు: రాజమౌళి
- రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్'
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 25వ తేదీన విడుదల
- మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారన్న రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' కోసం దేశ విదేశాల్లోని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఏ హీరో పాత్ర ముందుగా పరిచయమవుతుంది? ఒక పాత్ర మరొక పాత్రను ఎంతసేపటిలో కలుసుకుంటుంది? కథ ట్రాక్ ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది.
రాజమౌళి స్పందిస్తూ .. ప్రధానమైన పాత్రలు కలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ పాత్రల పరిచయం తరువాత ఎమోషనల్ జర్నీ మొదలు కావడానికి కూడా ఎక్కువ సమయం ఉండదు. ఇదంతా కూడా మొదటి 20 నిమిషాల్లోనే జరిగిపోతుంది. మళ్లీ ఈ సినిమా చూడాలనే ఆలోచనతోనే థియేటర్లలో నుంచి ప్రేక్షకులు బయటికి వస్తారు" అని స్పష్టం చేశారు.