శ్రీకాకుళం జిల్లా అమ్మాయికి జాక్‌పాట్.. రూ. 44 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌లో ఉద్యోగం
- పలాసకు చెందిన స్నేహ కిరణ్
- తండ్రి జీడిపప్పు ఫ్యాక్టరీలో కార్మికుడు
- ప్రస్తుతం బీటెక్ చదువుతున్న స్నేహ
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన అమ్మాయి స్నేహకిరణ్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. తండ్రి సింహాచలం స్థానిక జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, తల్లి సుభాషిణి గృహిణి. స్నేహ ప్రస్తుతం విశాఖపట్టణంలోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్, సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతోంది.
గణితంపై చిన్నప్పటి నుంచే పట్టు సంపాదించిన స్నేహ కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకుంది. స్నేహితులతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేసేది. అమెజాన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఇవన్నీ తనకు కలిసొచ్చాయని స్నేహ చెప్పుకొచ్చింది.