పోల‌వ‌రంలో నిలిచిన డ‌యాఫ్రం వాల్ నిర్మాణం.. కార‌ణ‌మేంటంటే..!

  • డ‌యాఫ్రం వాల్ నిర్మాణానికి భారీ ఎత్తున ఇసుక అవ‌స‌రం
  • గోదావ‌రి తీరం నుంచే ఇసుకు తీసుకుంటున్న మేఘా
  • రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లు త‌మ‌వేన‌ని వాదిస్తున్న జేపీ వెంచ‌ర్స్‌
  • మేఘా టిప్ప‌ర్ల‌ను అడ్డుకున్న జేపీ వెంచ‌ర్స్‌
ఓ వైపు ఏపీ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో కీల‌క చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే.. మ‌రోప‌క్క పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌కమైన డ‌యాఫ్రం వాల్ నిర్మాణం నిలిచిపోయింది. ఇందుకు గ‌ల కార‌ణం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్‌, రాష్ట్రంలో ఇసుక త‌ర‌లింపు కాంట్రాక్టును ద‌క్కించుకున్న జేపీ వెంచ‌ర్స్ మ‌ధ్య త‌లెత్తిన వివాద‌మే ప‌నులు నిలిచిపోవ‌డానికి కార‌ణంగా తేలింది.

డ‌యాఫ్రం వాల్ నిర్మాణానికి ఇసుక అవ‌స‌రం కాగా.. గోదావ‌రి తీరం నుంచి ఇసుక త‌ర‌లించుకునేందుకు వెళ్లిన మేఘా ఇంజినీరింగ్ టిప్ప‌ర్ల‌ను జేపీ వెంచ‌ర్స్ అడ్డుకున్నాయి. గోదావ‌రి తీరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల‌ను తామే ద‌క్కించుకున్నామ‌ని వాదిస్తున్న జేపీ వెంచ‌ర్స్‌.. ఇసుక‌ను తీసుకునేందుకు వ‌చ్చిన మేఘా సిబ్బందిని అడ్డుకుంది. 

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచే అక్క‌డ వివాదం రేగ‌గా.. ఇసుక కోసం వెళ్లిన మేఘా టిప్ప‌ర్లు 250 దాకా అక్క‌డే నిలిచిపోయాయి. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రంగంలోకి దిగిన అధికారులను సైతం జేపీ వెంచ‌ర్స్ లెక్క చేయ‌డం లేద‌న్న వాద‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.


More Telugu News